ఈటీవీ భారత్:ఆయుర్వేద జీవన శైలి కరోనా బారిన పడకుండా ఏ రకంగా ఉండాలని చెబుతోంది?
హరగోపాల్: ఆయుర్వేదమంటేనే ఆరోగ్యకర దీర్ఘాయు జీవనం. ఇందులో సమస్య వస్తే వైద్యం అనేది ఒక ఉపాంగం మాత్రమే. ఏ రోగం రాకుండా, ఏ సమస్య రాకుండా ఏ ప్రకారం జీవిస్తే అధి సాధ్యపడుతుందో చెబుతుంది. మనిషికి కావాల్సినవి రెండు ఆరోగ్యాలు. ఒకటి మానసిక ఆరోగ్యం, రెండోది శారీరక ఆరోగ్యం. వీటికి ఆహార నియమాలు ముఖ్యమైనవి. ఎప్పుడు మేల్కొనాలి, ఎప్పుడు ఏ పని చేయాలన్నది, ఇతరులతో ఎలా వ్యవహరించాలనేవి ఇందులో ఉంటాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నియమాలు తప్పినపుడు వారి ఇంట్లో లభించే వస్తువులు, వారికి అందుబాటులో ఉండే వస్తువులతోనే నయం చేసుకోవచ్చునని ఆయుర్వేదం చెబుతోంది. 90 శాతం వ్యాధులన్నీ చిన్నపాటి వస్తువులతోనే ఎవరికివారే పరిష్కరించుకోగలుగుతారు. ఏవో కొద్దిపాటి సమస్యలు మాత్రమే అంటే ప్రమాదాల వల్ల వచ్చేవాటికే వైద్యుని సాయం అవసరమవుతుంది. మిగిలిన వాటికి అవసరం ఉండదు.
ఈటీవీ భారత్: కరోనా 85 శాతం మందికి ఏ రకమైన మందులు లేకుండా తగ్గిపోతోంది. మరో పది మందికి అసుపత్రి అవసరం వస్తోంది. ఐదు శాతం మందికి సీరియస్ అవుతోంది. ఆందులో రెండు శాతం వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి గణాంకాలు చెబుతున్న వాస్తవాలు. 85 శాతం మంది సరైన జీవన విధానంలో ఉన్నారని భావించవచ్చా?
హరగోపాల్:శరీరానికి సహజంగానే ఏ వ్యాధినైనా నయం చేసుకునే శక్తి ఉంది. మానవుని పుట్టుక ఒక మాతృ, పితృ కణాలతో కలిసి ఏర్పడుతుంది. ఒక సెల్గా ఆవిర్భవించినటువంటి మనిషి.. 120 ట్రిలియన్ సెల్స్ శరీరంగా మారిపోతోందంటే దాంట్లో ఎంత తెలివి ఉండాలి. ఆ కణాల్లో ఏయే అవయవాలు ఏ కణాలు మారాయన్నది ఎవరు నిర్ణయించారు. శరీరానికి సహజంగా ఒక శక్తి ఉంది. ఏ చిన్న అవసరం వచ్చినా సరి చేసుకునే శక్తి కూడా ఆ శరీరానికి ఉంది. మనం చేయవలసిందల్లా అది సరిచేసుకునే విధానానికి అడ్డుపడకుండా ఉంటే చాలు. ఏ వైద్యమైనా శాస్త్రపరంగా చూసినా.. ఎవరు ఏ మందులు ఇచ్చినా, ఏ విధానాన్ని అలవంభించినా శరీరం చేసే రిపేరు ప్రక్రియకు దోహదం చేయడం మాత్రమే.
ఈటీవీభారత్: కరోనా సమయంలో జీవన శైలి, ఆహార నియమాలు ఏలా ఉండాలని నిర్దేశిస్తున్నారు.
హరగోపాల్: అన్ని అవయవాలకు రోజంతా రక్త సరఫరా జరుగుతూనే ఉంటుంది. పన్నెండు ప్రధానావయవాలను తీసుకుంటే, కొన్ని నిర్దేశిత సమయాల్లో మాత్రం 80 శాతం రక్త సరఫరా ఆ అవయవాలకు చేరుతుంది. ఆసమయంలోనే ఆ అవయవం చాలా ఎగ్రసివ్గా పని చేస్తుంది. ఉదాహరణకు ఉదయం మూడు గంటల నుంచి ఐదు వరకు శ్వాసకోశాలకు సంబందించిన సమయంగా ఉంటుంది. అంటే ఈ భాగం 80 శాతం పని అంతా ఆ సమయంలో జరుగుతుంది. ఐదునుంచి ఏడు గంటల వరకు పెద్ద పేగు యాక్టివ్గా పని చేస్తుంది. మలినాలను బయటకు పంపే ప్రక్రియ. ఈ సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవాలని చెబుతుంది. ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య జీర్ణాశయం బాగా యాక్టివ్గా ఉంటుంది. 80 శాతం రక్తం ఈ సమయంలో జీర్ణాశయానికి చేరడం వల్ల ఎటువంటి ఆహారం తీసుకున్నా సమస్య రాదు. వందశాతం అది జీర్ణమవుతుంది. అయితే ఈ సమయంలో ఆహారం తీసుకోవడం మానేసి ఇతర సమయాల్లో తీసుకుంటున్నారు. తొమ్మిది నుంచి 11 స్పీనల్ పాంక్రియాస్, 11 నుంచి ఒంటిగంట వరకు గుండె, ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు స్మాల్ ఇంటర్స్టెయిన్.. ఇలా విభజన ఉంటుంది. ఆయా సమయాల్లో ఆ అవయవాలు పూర్తిస్థాయిలో రక్తాన్ని పొందుతున్నాయి. ఈ సమయం కాకుండా వేరే సమయంలో ఆహారం తీసుకుంటే ఆ అవయవాలకు వెళ్లాల్సిన రక్తం జీర్ణాశయానికి బలవంతంగా మళ్లించాల్సి వస్తుంది. భవిష్యత్తులో వారికి ఆ అవయ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగదు. శరీరానికి అందించాల్సిన మూలకాలను అందకుండా లోపం ఏర్పడుతుంది. వ్యాధినిరోధక శక్తి, శరీర నిర్మాణానికి కావాల్సిన శక్తి అందుతుంది. నూటికి నూరు పాళ్లు అరగాలంటే ఇవి పాటిస్తేనే సాధ్యపడుతుంది. మధ్యాహ్నం ఆకలి వేస్తే పళ్లు, ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయల సలాడ్లు, మొలకలు వంటి ఉడికించని వాటిని ఆహారంగా తీసుకోవచ్చు. వీటిల్లో సహజంగా ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని అరిగించేందుకు ప్రత్యేక ఏర్పాటు అవసరం ఉండదు. సాయంత్రం వండిన ఆహారం తీసుకోవచ్చు. కానీ ఏ ఆహారమైనా సూర్యాస్తమయంలోగానే తీసుకోవాలి. సూర్యునికి మనలో జీర్ణశక్తికి సంబంధం ఉంది. చీకటిపడే కొద్దీ మన జీర్ణశక్తి తగ్గుతూ వస్తుంది. రాత్రి 9 గంటలకు నిద్రపోవాలి. 9 గంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు పూర్తిగా అవయవాలకు విశ్రాంతి ఇవ్వాలి. ఈ సమయం శరీరం రిపేర్లకు సమయం. మనం ఏ మందులు వాడినా నిజానికి అవి శరీరంలో పని చేసేది మాత్రం ఈ సమయంలోనే. అప్పటికి అవయాలన్నీ విశ్రాంతిలోకి రావాలంటే చిన్నప్రేగుకి కూడా పని ఉండకూడదు. మనం తీసుకున్న ఆహారం చిన్నప్రేగు దాటడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. తొమ్మిది గంటలకు చిన్నప్రేగు విశ్రాంతికి రావాలంటే మనం ఆరుగంటల లోపుగానే ఆహారం తీసుకోవాలి. ఇదే ప్రకృతి ధర్మంగా ఉంది. ఇలా చేసిన వారికి సర్వసాధారణంగా వ్యాధులే రావు. ఏదైనా పొరపాటు జరిగినా దానిని సరిదిద్దుకునే పని తొమ్మిది నుంచి మూడు గంటల మధ్యనే శరీరమే చేసుకుంటుంది. ఈ రకంగా ప్రకృతి నియమాలను అనుసరించి ప్రవర్తిస్తే వ్యాధుల బారిని పడడమే అరుదు.
ఈటీవీ భారత్: ఆధునిక జీవనశైలిలో ఇప్పుడు మీరు చెప్పే సమయాలు ఎంతవరకు సాధ్యపడుతాయి. దీనిని ఎలా అధిగమించాలి.
హరగోపాల్: ఎన్నిరకాల అలవాట్లు ఉన్నప్పటికి అవన్నీ ఆరోగ్యంగా బతికి బాగున్నప్పడే సాధ్యమవుతుంది. డబ్బు ఉంటే సరిపోదు.. ఆరోగ్యం ఉండాలి. ఆధునిక జీవన శైలి అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. మనం చెబుతున్నది ఆరోగ్యం, ఆనందం చుట్టూ తిరిగే పద్ధతి. ఈ రెండూ ప్రధాన అంశాలుగా తీసుకున్నట్టయితే ఈ సర్దుబాటు సాధ్యపడుతుంది. జీవనశైలిలో మార్పులు పెద్ద కష్టం కాదు. నిజానికి పొద్దున భోజనం చాలా సులువైన పని. ఆ తర్వాత వారికి దాదాపుగా వంటకు సంబంధించిన పనే ఉండదు. రోజంతా తమ వ్యాపకంలో ఉండొచ్చు. మధ్యాహ్నం భోజనం చేస్తేనే రోజంతా వంట పని ఉన్నట్టు ఉంటుంది. సూర్యోదయానికి ముందే లేచి, రాత్రి వేగంగా పడుకోమని చెబుతున్నాం. రాత్రి తొమ్మిది నుంచి మూడు గంటల వరకు నిద్రలో ఉండమని చెబుతున్నాం. ఈ సమయంలో గాల్ బ్లేడర్, ట్రిపుల్ వార్మర్, లివర్ చాలా ఎగ్రసివ్గా పని చేస్తాయి. మొత్తం శరీరం రిపేర్ పని అంతా ఆ సమయంలోనే జరుగుతుంది. రిపేర్ కోసం ఇచ్చిన విశ్రాంతి తప్ప మరేమీ కాదన్నది గుర్తుపెట్టుకోవాలి. తెల్లవారు జాము మూడు గంటలనుంచి చాలా ఉత్సాహంగా, చురుగ్గా రోజంతా ఉంటారు. ఎటువంటి మత్తు, బాధ ఉండదు. ఆధునిక జీవన శైలికి నిజానికి బాగా సరిపోయే పద్ధతి ఇదే.
ఈటీవీభారత్:ఆహార నియమాల ద్వారా, వంటింటి వస్తువుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?