'ముడసర్లోవ' కన్నీటి గాథపై... దేవిశ్రీ పాట - mudasarlova
విశాఖ వాసుల దాహార్తిని తీర్చిన ముడసర్లోవ ప్రస్తతం కన్నీరీడుతోందని పర్యావరణ కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు దేవిశ్రీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ జలాశయం వ్యథను పాట రూపంలో వినిపించారు.
విశాఖ మహానగరానికి తాగునీరందించి, సామాన్యుల గొంతు తడిపిన ముడసర్లోవ జలాశయం... బీటలువారి నీరింకిన విషాదాన్ని గీతంగా మలిచారు పర్యావరణ కళామండలి వ్యవస్ధాపక అధ్యక్షుడు దేవీశ్రీ. శతాబ్దకాలం నగరవాసుల దాహార్తిని తీర్చిన జలాశయం మానవ తప్పిదాల కారణంగా కనుమరుగైందనిఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం, కంబాల కొండలను తవ్వి రహదారులు నిర్మించడం వల్ల జలాశయానికి వచ్చే జలధారలు నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా మేధావులు, విద్యావంతులు, అన్ని వర్గాలవారూ ఈ జలాశయాన్ని బతికించేందుకు నడుం బిగించాలని దేవీశ్రీ పిలుపునిచ్చారు.