సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి వందలాది ఎకరాలు మాయం కావడంపై విచారణ వేగవంతం చేశారు. పంచగ్రామాల భూ జాబితా నుంచి 740 ఎకరాలు గల్లంతు కావడంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మంగళవారం దేవాలయంలో రికార్డులను విచారణ కమిటీ అధికారులు పరిశీలించారు. త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి.. నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్ అందజేస్తామని అధికారులు తెలిపారు.
సింహాచలం భూ అక్రమాల విచారణ వేగవంతం - simhachalam land issue enquiry
సింహాచలం దేవస్థానం భూముల జాబితా నుంచి వందలాది ఎకరాలు మాయం కావడంపై విచారణ కొనసాగుతోంది. మంగళవారం దేవాలయంలోని రికార్డులను విచారణ అధికారులు పరిశీలించారు.
![సింహాచలం భూ అక్రమాల విచారణ వేగవంతం simhachalam land issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12445483-405-12445483-1626175658355.jpg)
సింహాచలం భూముల అక్రమాల విచారణ వేగవంతం..
పంచగ్రామాల భూ జాబితా నుంచి వందల ఎకరాలు గల్లంతు కావడంపై విచారణకు.. ప్రభుత్వం ముగ్గురు అధికారులను నియమించింది. విచారణ అధికారులుగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ను నియమించారు.
ఇదీ చదవండి: