ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అర్చకుల డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపండి: స్వరూపానందేంద్ర స్వామి - ఏపీ దేవాదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీమోహన్

అర్చకుల డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం చొరవ చూపాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. ప్రభుత్వానికి సూచించారు. చాతుర్మాస్య దీక్షను చేపట్టిన స్వరూపానందేంద్ర స్వామిని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీమోహన్ కలిశారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖలో తీసుకువచ్చిన మార్పుల గురించి చర్చించారు.

endowments principal secretary vani mohan
swamy swaroopanandendra saraswati

By

Published : Aug 21, 2021, 3:21 PM IST

ఆలయాల్లో అర్చకులకు కల్పించిన వంశపారంపర్య హక్కులను అమలు చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ప్రభుత్వానికి సూచించారు. రిషికేష్ వెళ్లి చాతుర్మాస్య దీక్ష చేపట్టిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములను దేవాదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీమోహన్ కలిశారు. ఇటీవల దేవాదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకొచ్చిన మార్పులను స్వామి స్వరూపానందేంద్రకు వాణీమోహన్ వివరించారు.

ఈ సందర్భంగా అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని స్వామీజీ సూచించారు. కొవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా పూజలు, వ్రతాలు చేపట్టడం ద్వారా మంచి స్పందన రావడమే కాక.. ఆదాయం సైతం పెరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు. ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం చర్యలు తీసుకోవాలని స్వామీజీ సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details