డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన..మద్దతిచ్చిన వామపక్షాలు - చలో విజయవాడ
Employees protest in Visakha : విశాఖలోని జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద పే స్కేల్, ప్రైవేట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఉద్యోగుల నిరసనకు పలువురు సీపీఎం, సీపీఐ నేతలు మద్దతు పలికారు. పీఆర్సీ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైందని ఇప్పటికైనా సీఎం జగన్ మేల్కొని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు ఉద్యోగులు పిలుపునిచ్చారు.
Employees protest in Visakha