కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని విశాఖలో తూర్పు నౌకాదళం అమరవీరులకు నివాళులర్పించింది. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏకే జైన్... అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు.
విశాఖ సాగరతీరంలోని విక్టరీ ఎట్ సీ స్మారకం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, విశాఖ మహా నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ సృజన.. అమర వీరులకు అంజలి ఘటించారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలొడ్డి మాతృభూమిని రక్షించిన సైనికుల త్యాగాలను దేశప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఏకే జైన్ కొనియాడారు.