నిధుల్ని వాడుకోవడంలో పొదుపు, రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా రాబట్టుకునే విషయంపై దృష్టి పెట్టాలని సూచిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. శ్రీకాకుళం జిల్లా సముద్రతీరంలో ఇసుకను తవ్వి అతి విలువైన అణు ఖనిజాల్ని విదేశాలకు పంపే ఓ ప్రైవేటు సంస్థపై 2016లో రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టరేట్ విచారణ చేపట్టిందని..,దానిపై రూ.1,295 కోట్ల జరిమానా విధించాలని నివేదికలో తెలిపారన్నారు. అయినా ఇప్పటికీ నాటి, నేటి ప్రభుత్వాలు ఆ జరిమానా రాబట్టే దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఇప్పుడు వడ్డీతో ఆ కంపెనీ నుంచి రూ.2,230 కోట్లు వసూలు చేయాల్సి ఉందని.. అలాంటి కంపెనీ నుంచి 22,982 టన్నుల ఖనిజ నిల్వల్ని మరో కంపెనీకి తరలించుకోవచ్చని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి వసూళ్లు జరపని కారణంగా పారిశుద్ధ్య సిబ్బందికి కనీసం వేతనాలు రావడంలేదని, దీనికి మీ ప్రభుత్వ సమాధానమేంటని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాబోయే మూడేళ్లలో రావాల్సిన ఆదాయ వివరాలు, అయ్యే ఖర్చులు, ప్రభుత్వం చేస్తున్న రుణభారం వివరాలతో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎంను కోరారు.
రావాల్సిన ఆదాయాన్ని పట్టించుకోరా ?: ఈఏఎస్ శర్మ - ఈఏఎస్ శర్మ లేఖ
నిధుల్ని వాడుకోవడంలో పొదుపు, రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా రాబట్టుకునే విషయంపై దృష్టి పెట్టాలని సూచిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాబోయే మూడేళ్లలో రావాల్సిన ఆదాయ వివరాలు, అయ్యే ఖర్చులు, ప్రభుత్వం చేస్తున్న రుణభారం వివరాలతో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎంను కోరారు.
రావాల్సిన ఆదాయాన్ని పట్టించుకోరా ?: ఈఏఎస్ శర్మ