రాష్ట్ర ప్రభుత్వం మూల కణ మార్పిడి (బీఎంటీ) చికిత్స విధానాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చినందుకు ముఖ్యమంత్రికి అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ వూణ్ణ మురళీ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చికిత్స పొందడానికి ఎంతో మంది చిన్నారులు ముఖ్యమంత్రి సహాయ నిధి అనుమతి కోసం ఎదురు చూసే పరిస్దితి ఉండేదని, ఇప్పడీ నిర్ణయం వల్ల వారికి ఆ నిరీక్షణ తప్పిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ చికిత్స పొందేందుకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం పెద్ద ఊరటని వివరించారు. ఈ సదుపాయం రాష్ట్రంలో కేవలం విశాఖ మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో పూర్తిస్దాయిలో అందుబాటులో ఉందని డాక్టర్ మురళీ కృష్ణ చెప్పారు.
ఆరోగ్య శ్రీలోకి బీఎంటీ చికిత్స... సీఎంకు ధన్యవాదాలు - విశాఖ తాజా వార్తలు
మూల కణ మార్పిడి చికిత్స విధానాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చినందుకు ముఖ్యమంత్రి జగన్‌కి అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ డాక్టర్ వూణ్ణ మురళీ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
డాక్టర్ వూణ్ణ మురళీ క్రిష్ణ