ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ .. కంటికి కనపడని శత్రువైన వైరస్ను ఎదుర్కోవాలంటే.. ప్రతీ ఒక్కరూ గొడుగు అఅనే ఆయుధం ఉపయోగించాలని వైద్య నిపుణులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అన్నారు. వైజాగ్ న్యూస్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుద్వార్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గొడుగు సిద్ధాంతంపై అవగాహన కల్పించారు. గొడుగు వాడకం వల్ల మనిషికీ.. మనిషికీ మధ్య దూరం పెరిగి కోవిడ్-19 వైరస్ దరి చేరకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విధానంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేందుకు అవకాశం పెరుగుతుందని తెలిపారు. విలేకరులు, పోలీస్ సిబ్బందికి గొడుగులు పంపిణీ చేశారు.