జీవీఎంసీ కమిషనర్‌గా.. డాక్టర్ సృజన తిరిగి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు నుంచి దాదాపు నెల పాటు ఆమె సెలవుపై వెళ్లారు. ఆ సమయంలో వీఎంఆర్‌డీఏ కమిషనర్ కోటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మికి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇస్తూ కమిషనర్‌గా నియమించారు.
సెలవులో ఉండగానే సృజనను ప్రభుత్వం బదిలీ చేస్తూ.. అమరావతిలోని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని సూచించింది. ఎన్నికలకు ముందు ఆమె బదిలీ కాగా.. వేరే జిల్లాకు పంపనున్నారని చర్చలు నడిచాయి. కానీ అనూహ్యంగా ఆమెనే మళ్లీ జీవీఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. "తిరిగి ఇక్కడికే వచ్చినందుకు ఆనందంగా ఉంది" అని సృజన తెలిపారు. నగరంపై అవగాహన ఉన్నందున.. కొత్త పాలకవర్గంతో కలిసి మరింత మెరుగ్గా పనిచేస్తానని చెప్పారు.