ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అదుగో.... నింగిని తాకే వెలుగుల నిశ్శబ్ద దీపావళి

వేయి వెలుగుల దీపావళిని ఆ దివ్యాంగులు భిన్నంగా  వెలిగించనున్నారు. తిమిరంతో సమరంగా వెలిగే పండుగను ఆదర్శప్రాయంగా, అందరినీ ఆకర్షించేలా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. తల్లిదండ్రులకు భారం కారాదని సూచించేలా ఆదాయ మార్గంగా వేడుక జరుపుకోనున్నారు.

అదుగో.... నింగిని తాకే వెలుగులతో నిశ్శబ్ద దీపావళి

By

Published : Oct 19, 2019, 6:43 PM IST

అదుగో.... నింగిని తాకే వెలుగులతో నిశ్శబ్ద దీపావళి
రానున్నది దివ్వెల పర్వదినం దీపావళి సందర్భంగా విశాఖలోని ప్రజ్వలవాణి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ప్రత్యేక ఆకర్షణలతో దీపావళి ప్రమిదలు, లాంతర్ దీపాలు క్యాండిల్స్ రూపొందించేందుకు దివ్యాంగులకు శిక్షణ ఇస్తోంది. ముందుగా దాతల నుంచి సేకరించిన సొమ్ముతో హైదరాబాద్ నుంచి మైనం, స్థానిక కుమ్మర్ల నుంచి మట్టి ప్రమిదలు కొనుగోలు చేస్తున్నారు. ప్రమిదలకు ఆకర్షణీయమైన రంగులు వేసి బంగారు, వెండి రంగులు అద్దారు. కొన్ని ప్రత్యేక ప్రమిదలకు పైన చిమ్నీఏర్పాటు చేశారు. దివ్యాంగులు రూపొందించిన ఆకర్షణీయమైన ప్రమిదలను విశాఖలోని షాపింగ్ మాల్స్, సాగరతీరంలో విక్రయించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిని విక్రయించగా వచ్చే సొమ్మును రానున్న 25న తమ తల్లిదండ్రులకు అందిస్తారు. లోకం పోకడ తెలియని ఆ మనోవికాసం లేని ముద్దు బిడ్డలు' సమాజానికి కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రజ్వలవాణి వెల్ఫేర్ సొసైటీ, వారికి ఆదాయం సాధించే శిక్షణ ఇస్తోంది.


తమ బిడ్డలు ఈ రకంగా ప్రయోజకులు అవుతున్నందుకు చమరించిన కళ్ళతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగుల తల్లిదండ్రులు. దివ్వెలు వెలిగేలా కోటి కళ్ళలో ఆనందం నిండేలా దీపావళి జరుపుకోవాలని సొసైటీ నిర్వాహకులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details