లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి తమవంతు సహాయం అందిస్తున్నారు దాతలు. విశాఖ జిల్లాలోని జీవిఎంసీ 37వ వార్డు ఫిషింగ్ హార్బర్ సమీపంలో పెయన్ దొర పేటలోని 1200 మత్స్య కారకుటుంబాలకు సరకులు పంచారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. సరకులతో ప్రతి కుటుంబానికి 5 కేజీల జియ్యం అందించారు. మత్స్యకారులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఎంపీ తెలిపారు.