విశాఖ జిల్లాలో వాసవాణిపాలెం,పెద్ద జలారిపేట మత్స్యకారులు మధ్య వివాదం రాజుకుంది. పెద్దజాలరిపేటకు చెందిన కొందరు తమపై మరణాయుధాలతో దాడి చేశారని వాసవాణిపాలెం మత్స్యకారులు ఆరోపించారు. ఆరు బోట్లకు నిప్పు పెట్టారని, వలలను సైతం దగ్ధమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలు క్రితం ఇదే తరహా వివాదం జరిగిందని... కాలెక్టర్ కార్యాలయంలో చర్చలు జరిగాయని తెలిపారు. కానీ మళ్లీ రింగు వలలు, సాంప్రదాయ మత్స్యకారులు మధ్య మళ్లీ వివాదం మొదలైంది. ఆరు బోట్లకు నిప్పుపెట్టడంతో వాసవానిపాలెం గ్రామస్తులు నిరసనకు దిగారు. విశాఖ ఏసీపీ మూర్తి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
Fishermen of Visakhapatnam: విశాఖలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం... మోహరించిన పోలీసులు
Fishermen of Visakhapatnam: విశాఖ జిల్లాలో మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. రిగ్గువలల విషయంలో మరోసారి వాసవాణిపాలెం, పెద్దజాలరిపేట మత్స్యకారుల మధ్య గొడవ చోటుచేసుకుంది. అర్థరాత్రి పెద్దజాలరిపేటకు చెందిన కొందరు మారణాయుధాలతో తమపై దాడి చేశారని వాసవాణిపాలెం మత్స్యకారులు ఆరోపించారు. ఆరుబోట్లు తగులబెట్టి.. వలలను కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం
Last Updated : Jul 29, 2022, 10:19 AM IST