విశాఖ కళాభారతి వేదికగా ద్వారం నరసింగరావు నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయ త్యాగరాజ సంగీతసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంగీత రంగంలో చేసిన కృషికిగాను కొల్లూరు వందనకు సంగీత సుధానిధి బిరుదు ప్రదానం చేశారు. అనంతరం మంథా రమ్య వయోలిన్ సహకారం, ఫాల్గుణ మృదంగ సహకారంతో కొల్లూరు వందన సంగీత కచేరి చేసి ఆహుతులను అలరించారు.
ఘనంగా ద్వారం నరసింగరావు జయంతి వేడుకలు - విశాఖ
ద్వారం నరసింగరావు నాయుడు జయంతి వేడుకలు విశాఖ కళాభారతి వేదికలో వైభవంగా నిర్వహించారు. సంగీత కళాకారులు తమ సంగీతంతో ఆహుతులను ఆకట్టుకున్నారు.

విశాఖలో ద్వారం నరసింగరావు జయంతి వేడుకలు