విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదస్థలాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. జరిగిన ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మాట్లాడిన డీజీపీ... ప్రమాదస్థలాన్ని సాంకేతిక నిపుణులు పరిశీలిస్తారని తెలిపారు. దిల్లీ నుంచి మరికొందరు నిపుణులు వస్తున్నారన్నారు. ఘటనాస్థలిలో సాధారణ పరిస్థితి తెచ్చేందుకు వేగంగా సహాయచర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
సాధారణ పరిస్థితికి వేగంగా చర్యలు : డీజీపీ - విశాఖ ఎల్జీ పాలిమర్స్ డీజీపీ సవాంగ్ పర్యటన
విశాఖ గ్యాస్ లీక్ ఘటనాస్థలిని డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. అనంతరం ప్రమాదప్రభావంపై సమీక్ష నిర్వహించారు. దిల్లీ నుంచి నిపుణులు వచ్చి.. ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తారని డీజీపీ చెప్పారు. సాధారణ పరిస్థితి తెచ్చేందుకు వేగంగా సహాయచర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
సాధారణ స్థితి తెచ్చేందుకు వేగంగా చర్యలు : డీజీపీ
గ్యాస్ లీక్ ఘటన సహాయచర్యల్లో పాల్గొంటూ పలువురు పోలీసులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా కేజీహెచ్, కేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డీజీపీ.. వారికి పరామర్శించనున్నారు.
ఇదీ చదవండి :విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్ద గ్రామస్థుల ఆందోళన
Last Updated : May 9, 2020, 11:59 AM IST