ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో 'రహదారి భద్రత మిత్ర' ప్రారంభం - dgp started news programme in vizag

రహదారి భద్రత, ప్రమాదాల నివారణ విషయంలో ప్రజలను భాగస్వాములు చేసేలా... పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ పేర్కొన్నారు.

విశాఖలో 'రహదారి భద్రతా మిత్ర' ప్రారంభించిన డీజీపీ

By

Published : Nov 14, 2019, 7:42 PM IST

విశాఖలో 'రహదారి భద్రత మిత్ర' ప్రారంభం

విశాఖలో 'రహదారి భద్రత మిత్ర' కార్యక్రమాన్ని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ ప్రారంభించారు. ప్రమాదం జరిగినప్పుడు అవసరమైన ప్రాథమిక చికిత్స అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డీజీపీ తెలిపారు. రహదారికి పక్కన ఉండే దుకాణాల వద్ద ప్రాథమిక చికిత్స కిట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. దీని వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సవాంగ్ వివరించారు.

రహదారి భద్రత, ప్రమాదాల నివారణ విషయంలో సామాన్య ప్రజలను భాగస్వాములు చేసేలా... పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని వివరించారు. స్పందన కార్యక్రమం ద్వారా... పెద్ద సంఖ్యలో ప్రజాసమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. 42 వేలకు పైగా ఫిర్యాదులు వస్తే... వాటిలో 94శాతం మేర పరిష్కరించామని డీజీపీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details