ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DGP On Drugs: ఏపీలో డ్రగ్స్ లేవు: డీజీపీ - గంజాయిపై డీజీపీ కామెంట్స్

ఏపీలో డ్రగ్స్ లేవని, గంజాయి సాగు మాత్రమే ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గంజాయి నివారణకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని.. ఇప్పటికే 7 రాష్ట్రాల అధికారులతో చర్చించామన్నారు. ముంద్రా పోర్టు డ్రగ్స్‌కు, ఏపీకి సంబంధం లేదని పదేపదే చెప్పినా.. ఇంకా అవాస్తవాలు ప్రచారం చేయటం సరికాదన్నారు.

DGP On Drugs
DGP On Drugs

By

Published : Nov 1, 2021, 9:52 PM IST

Updated : Nov 1, 2021, 10:01 PM IST

ఏపీలో డ్రగ్స్ లేవు

ఏవోబీలో ఎప్పట్నుంచో గంజాయి సాగవుతోందని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ అన్నారు. ఏవోబీలో గంజాయి సాగుకు నక్సల్స్ సహకారం అందిస్తున్నారని చెప్పారు. గంజాయి రవాణా అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామన్నా డీజీపీ.. అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గంజాయిని అరికట్టేందుకు ఆధునిక సాంకేతికత వినియోగిస్తామని తెలిపారు. ఇప్పటికే గంజాయి నివారణకు 7 రాష్ట్రాల అధికారులతో చర్చించామన్నారు. చర్చల్లో డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారని డీజీపీ తెలిపారు.

ఏపీలో డ్రగ్స్ లేవని.. గంజాయి సాగుమాత్రమే ఉందని డీజీపీ సవాంగ్ అన్నారు. ముంద్రా పోర్టు డ్రగ్స్‌కు, ఏపీకి సంబంధం లేదని పదేపదే చెప్పినా.. ఇంకా అవాస్తవాలు ప్రచారం చేయటం సరికాదన్నారు. గంజాయి నివారణ కోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని.. సమూల నిర్మూలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పూర్తి నిఘాతో గంజాయిని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. సాగు నుంచి రవాణా వరకు సమగ్ర నివేదిక తయారుచేస్తున్నామని.., దీని వెనుక నక్సల్స్ పాత్ర ఎక్కువగా ఉందన్నారు. గంజాయి సాగు నక్సల్స్‌కు ఆదాయ వనరుగా మారిందని డీజీపీ వెల్లడించారు. ప్రస్తుతం ఏవోబీలో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని.. గిరిజనులే నక్సల్స్‌ను దగ్గరకు రానీయడం లేదన్నారు. త్వరలోనే గంజాయి సాగు పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు.

"ఏవోబీలో ఎప్పట్నుంచో గంజాయి సాగు. గంజాయి నివారణకు 7 రాష్ట్రాల అధికారులు చర్చించాం. ఏపీలో డ్రగ్స్ లేవు.. గంజాయి సాగు మాత్రమే ఉంది. ఏపీలో డ్రగ్స్ ఉన్నాయని పదేపదే తప్పుడు ప్రచారం చేయవద్దు. ముంద్రా పోర్టు డ్రగ్స్‌కు, ఏపీకి సంబంధం లేదని పదేపదే చెప్పాం. గంజాయి నివారణ కోసం ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. గంజాయి సాగు, రవాణా వెనుక నక్సల్స్ పాత్ర ఎక్కువ. నక్సల్స్‌కు గంజాయి ఆదాయ వనరుగా మారింది. ఏవోబీలో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. ఈ అవకాశం వాడుకుని గంజాయి సాగు నివారణకు చర్యలు తీసుకుంటాం." -గౌతమ్ సవాంగ్, డీజీపీ


ఇదీ చదవండి

TDP ON CM JAGAN: ప్రతిపక్షాల్ని భయపెట్టడం.. డ్రగ్స్ సమస్యకు పరిష్కారం కాదు: తెదేపా

Last Updated : Nov 1, 2021, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details