విశాఖ శారదా పీఠంపైనా, స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని విశాఖ శారదా పీఠం భక్తుడు బొగ్గు శ్రీను తెలిపారు. సమాజహితం కోరుకునే స్వామిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం దురదృష్టకరమని అన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళ పాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయనతో పాటు కనీస అర్హతలేనివారూ.. విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు.
'స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోం' - విశాఖ శారదా పీఠం న్యూస్
సమాజ హితం కోరుకునే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం దురదృష్టకరమని విశాఖ శారదా పీఠం భక్తుడు బొగ్గు శ్రీను అన్నారు. ఈ సందర్భంగా విశాఖ శారద పీఠంపై గానీ, స్వామిపై గానీ ఎవరైనా లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
'స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోం'
స్థానిక ప్రజలకు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చేస్తున్న సేవా కార్యక్రమాలను తాను చిన్ననాటి నుంచి చూస్తూ పెరిగానని చెప్పారు. పీఠంపై గానీ, స్వామిపై గానీ ఎవరైనా లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా బొగ్గు శ్రీను హెచ్చరించారు.