సమాజంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని మాజీ డీజీపీ హెచ్.జె. దొర అన్నారు. విశాఖలో ఆయన రచించిన 'జర్నీ త్రూ టర్బలెంట్ టైమ్స్' ఆత్మకథ పుస్తకాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. అన్నివర్గాలకు స్ఫూర్తినిస్తూ పోలీసు నాయకుడిగా దొర ఎదిగారని తమ్మినేని అన్నారు. ఏపీ దేశంలోనే పోలీసింగ్ లో ఓట్రెండ్ సెట్టర్‌గా మారడంలో హెచ్.జె.దొర కీలక పాత్ర పోషించారని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రశంసించారు. గన్, బుల్లెట్లతో కాకుండా మనసు, ఆలోచనలతో మావోయిస్టుల్లో మార్పుతీసుకువచ్చిన ఘనత దొరకు దక్కుతుందన్నారు. ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి కిల్లికృపారాణి, విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కేమీనా సహా రాజకీయ, విద్యారంగ ప్రముఖులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం: హెచ్.జె. దొర
మాజీ డీజీపీ హెచ్.జె. దొర రచించిన 'జర్నీ త్రూ టర్బలెంట్ టైమ్స్' పుస్తకాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవిష్కరించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ, విద్యారంగ ప్రముఖులు, పోలీస్ అధికారులు హాజరయ్యారు.
'development is possible when there is peace' says h.j. dora