ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ...విశాఖ గీతం వర్శిటీలో కట్టడాలను అధికారులు కూల్చేశారు. వేకువజామునుంచే ప్రక్రియను ప్రారంభించారు. రుషికొండ మార్గంలో ఉన్న భారీ గేటును తొలుత కూల్చేసిన అధికారులు...అనంతరం ప్రహరీ గోడలన్నీ కూల్చేశారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రహరీ కూల్చివేత పూర్తయ్యాక... వైద్యకళాశాల నార్త్‌గేట్‌లో ఉన్న ప్రహరీగోడను పడగొట్టారు. ముందుగానే భారీగా చేరుకున్న పోలీసులు... బారికేడ్లు ఏర్పాటు చేసి లోపలికి ఎవరినీ రానివ్వలేదు. రెవెన్యూ అధికారులు దగ్గరుండి ప్రక్రియను పర్యవేక్షించారు.
సమాచారం తెలుసుకుని వర్శిటీకి చేరుకున్న యాజమాన్యం ప్రతినిధులు...... అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటీసులు ఇవ్వకుండానే వర్సిటీ కట్టడాలను కూల్చివేశారని ఆరోపించారు. ఎందుకు కూల్చేశారో తెలియడం లేదని చెప్పారు. అధికారులు కనీస పద్ధతి పాటించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.