ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ గ్యాస్ లీక్: సహాయ చర్యల్లో డీసీపీకి అస్వస్థత - విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం

విశాఖ ఆర్.ఆర్ వెంకటాపురంలో.. గ్యాస్ లీక్ ఘటనలో సహాయచర్యల్లో పాల్గొన్న డీసీపీ బిర్లా అస్వస్థతకు గురయ్యారు.

DCP SICKNESS IN VISAKHA GAS LEAK DISASTER
విశాఖ గ్యాస్ లీక్ సహాయ చర్యల్లో డీసీపీకు అస్వస్థత

By

Published : May 7, 2020, 9:55 AM IST

విశాఖ గ్యాస్ లీక్ సహాయచర్యల్లో పాల్గొని డీసీపీ బిర్లా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. వెంకటాపురంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను సొంత వాహనాలు, అంబులెన్స్‌ల్లో కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. సమీపంలోని గ్రామాల్లోకి సిబ్బంది వెళ్లలేక పోతున్నారు.

తన వాహనంలోనే బాధితులను ఆస్పత్రికి తరలించారు విశాఖ నగర సీపీ. పరిశ్రమలోని లీకేజీ ప్రాంతాన్ని అదుపు చేయడానికి బృందాలు యత్నిస్తున్నాయి. అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఎన్టీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, పోలీసులు బృందాలు ఘటనాస్థలి నుంచి ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details