Daughters conduct funerals to father: కని పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి రుణాన్ని తీర్చుకున్నారు కుమార్తెలు. కుమారులు లేకపోవటంతో తండ్రి మృతదేహానికి వారే దగ్గరుండి దహన సంస్కారాలు(daughters conducted the funeral) చేశారు. విశాఖలోని ఎంవీపీకాలనీ సెక్టారు-2లో నివాసముంటున్న గణపతిరావుకు ఇద్దరూ ఆడపిల్లలే. వీరిలో రీతూపర్ణ వివాహిత. ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమార్తె ఉపాసన అవివాహిత. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న గణపతిరావు మంగళవారం మృతి చెందారు. దీంతో ఇద్దరు కుమార్తెలు దగ్గరుండి బుధవారం అన్ని కార్యక్రమాలను చేపట్టారు.
అంతా తామై.. తండ్రి అంత్యక్రియలు చేసిన కుమార్తెలు - తండ్రికి అంత్యక్రియలు చేసిన కూమార్తెలు
కొడుకులు లేని.. ఆ తండ్రికి అన్ని తానై.. అంతిమ సంస్కారాలు చేశారు కుమార్తెలు. కొడుకులు లేకపోతేనేమీ.. తన తండ్రికి అన్ని తామేనంటూ.. కుమార్తెలు చూపిన మమకారాన్ని పలువురు అభినందించారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.
funeral
తండ్రి శవయాత్రలో పాల్గొని పాడెను సైతం మోశారు. తర్వాత శ్మశానవాటికలో వారి ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా దహన సంస్కారాల్లో పాల్గొని తండ్రి చితికి నిప్పంటించారు.
ఇదీ చదవండి
THIEVES ATTACK ON POLICE: గోపాలపట్నంలో దొంగలు హల్చల్... పోలీసులపై ఎదురుదాడి
Last Updated : Nov 25, 2021, 5:13 PM IST