'విశాఖకు దండుపాళ్యం బ్యాచ్ వస్తోంది జాగ్రత్త' అని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర సహజ సంపద, విశాఖ భూముల కోసమే 3 రాజధానుల ఎత్తుగడ అని ఆయన ఆరోపించారు. ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టడానికే విశాఖపై కన్నేశారని దుయ్యబట్టారు. 'దండుపాళ్యం బ్యాచ్ గో బ్యాక్... జగన్ గో బ్యాక్' నినాదాలతో ఉత్తరాంధ్ర ప్రతిధ్వనించాలన్నారు.
విశాఖకు దండుపాళ్యం బ్యాచ్ వస్తోంది: కూన రవికుమార్ - కూన రవికుమార్ వార్తలు
వైకాపా సర్కార్‌పై తెదేపా నేత కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలోని అపార ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు మూడు రాజధానుల ఎత్తుగడ వేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఉత్తరాంధ్ర ప్రజలు గళమెత్తాలని కోరారు.
కూన రవికుమార్
జగన్, విజయసాయిలకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే విశాఖ భూ అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జగన్ అనే గ్రహణం పట్టిందని... దీనిని వదిలించుకోవాలంటే ప్రజా తిరుగుబాటే మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రకటించే అధికారం విజయసాయిరెడ్డికి ఎవరిచ్చారని కూన రవికుమార్ నిలదీశారు.
ఇదీ చదవండి:'అమరావతి' కోసం రైతు ఆత్మహత్యాయత్నం