బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని ఒకటి నుంచి పదో తరగతి వరకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ విశాఖ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. దళితులను చదువులకు దూరం చేయాలనే దురుద్దేశంతో వైకాపా ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని 9-10 తరగతులకు మాత్రమే అమలు చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు నష్టపోతారన్నారు.
వైకాపా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జీవోలు మార్చి విద్యతో ఆడుకుంటోందని ఆగ్రహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపటి నుంచి మూడు రోజుల పాటు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని దళిత విద్యార్థుల తల్లిదండ్రుల ఐకాస పిలుపునిచ్చింది.