తెదేపా ప్రభుత్వ అవినీతి భరించలేకే ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారని... కానీ అధికారంలోకి వచ్చిన వైకాపా కూడా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతోందని భాజపా జాతీయ నాయకురాలు పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు తరహాలోనే జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాల పంపకం 2రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా చూడడం సరైనది కాదని పేర్కొన్నారు. రైతు సంఘాలు, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) అవినీతి జరిగితే సమీక్షించడం మంచిదేనన్న పురంధేశ్వరి... రద్దు నిర్ణయం సరికాదన్నారు. పీపీఏలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
'సమీక్షించడం మంచిదే... రద్దు సరికాదు' - bjp leader
ప్రత్యేక హోదాపై చంద్రబాబు తరహాలోనే జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని... ప్రజలు ఆలోచించాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పురంధేశ్వరి పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి