అమరావతి రైతులు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖలో మాట్లాడుతూ.. రైతులను ఇబ్బందిపెట్టే పని వైకాపా ప్రభుత్వం ఎన్నటికీ చేయదని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి చంద్రబాబు రగిలిపోతున్నారే తప్ప.. రైతుల తరఫున ఆలోచించి వాళ్లకు మంచి జరిగే విధంగా ప్రతిపాదనలు చేయడం లేదని విమర్శించారు. రైతులు నేరుగా ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడాలని సూచించారు. చంద్రబాబునాయుడు స్వప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
'రైతులను ఇబ్బందిపెట్టే పని వైకాపా ప్రభుత్వం ఎన్నడూ చేయదు' - చంద్రబాబునాయుడిపై దాడి వీరభద్రరావు విమర్శలు
అమరావతి రైతులు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

దాడి వీరభద్రరావు