విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని దివీస్ ల్యాబ్ ఫ్యాబ్రికేషన్ యార్డులో ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విశాఖలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
fire accident in Divis: దివీస్ పరిశ్రమలో పేలుడు.. ఇద్దరి పరిస్థితి విషమం - visakhapatnam-district
12:03 December 11
ఇద్దరి పరిస్థితి విషమం
క్షతగాత్రుల్లో శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ప్రాంతానికి చెందిన జి.లక్ష్మణరావు(29), శ్రీనివాసరావు(22)తోపాటు బీహార్‌కు చెందిన ధీరజ్ కుమార్(34), విజయనగరం జిల్లా తెర్లాం మండలం లోచర్లకు చెందిన వై.రమేశ్ కుమార్ (30) ఉన్నారు.
వీరు ప్రస్తుతం విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుడు జి.లక్ష్మణరావు సొంతంగా సాయినాథ్ ఫ్యాబ్రికేషన్ వర్క్ పేరిట దివిస్ లేబరేటరీలో కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్నాడని తెలిపారు.
ఇదీ చదవండి.