విశాఖవాసుల సైకిల్ యాత్ర.. పర్యావరణంపై సందేశం - పర్యావరణ సందేశం ఇచ్చేందుకు సైకిల్‌పై యాత్ర
పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు విశాఖ వాసులు సైకిల్ యాత్ర చేపట్టారు. గత మూడేళ్లుగా ఈ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు.
కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటే ఆసక్తి ఉండాలి... అదేవిధంగా సత్తువ కావాలి... ఊళ్లను చుట్టి వెళ్లేటప్పుడు నలుగురికీ సందేశమూ అందించాలని అనుకున్నారు ఈ ఇద్దరూ. పర్యావరణంపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా విశాఖ నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేపడుతున్నారు. విశాఖలో ఆటోమొబైల్ వ్యాపారం చేసే శివకుమార్, అశోక్‌లు ఏడాదిలో 10 రోజులు ఈ యాత్ర చేస్తున్నారు. వీలైనంత వరకు సైకిల్ వాడాలి... పర్యవరణాన్ని కాపాడాలి... శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ఇంధన వనరులు పొదుపు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
TAGGED:
విశాఖ వాసుల సైకిల్ యాత్ర