విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో... ఇంజినీరింగ్ విద్యార్థులకు సైబర్ నేరాలు, వాటితో ముప్పుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచితుల నుంచి విద్యార్థులు, యువతులు ఎలా మోసపోతున్నారనే విషయంపై నగర సైబర్ క్రైం సిఐ గోపీనాథ్ విద్యార్థులకు వివరించారు. నగరంలో ఎక్కువగా నమోదవుతున్న కేసులను వాటిని ఛేదించిన విధానాలను, నేరగాళ్లు ఎక్కువగా పాల్పడే ఫిషింగ్, లాటరీ, నకిలీ ప్రకటనలు వంటి విషయాలపై అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలతో ముప్పుపై.. విద్యార్థులకు అవగాహన సదస్సు - visakhapatnam
కొద్దిపాటి అజాగ్రత్త కారణంగా సైబర్ నేరగాళ్ల చేతులకు చిక్కిపోతున్న నేటి యువతరానికి.. ఆ ముప్పు నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేశారు.. విశాఖ పోలీసులు.
విశాఖలో విద్యార్థులకు సైబర్ నేరాల అవగాహన సదస్సు