రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ లోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఈ నెల 5 నుంచి ఆంక్షలు ఎత్తివేసే వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పగటిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నందున ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ స్పష్టం చేశారు.
ఏపీలో వేకువ జామునే వైన్స్... - Curfew from today in AP
కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో.. ఏపీలో నేటి నుంచి ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
![ఏపీలో వేకువ జామునే వైన్స్... Curfew from today in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:14:16:1620175456-ap-vsp-51-05-madyam-shop-la-time-kudhimpu-av-ap10081-05052021060725-0505f-1620175045-141.jpg)
Curfew from today in AP
నిత్యావసర సరుకులు, ఇతర కార్యకలాపాలకు పరిమితంగా అనుమతి ఇవ్వగా.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణా ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాల రవాణాను నిలిపి వేయనున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
Last Updated : May 5, 2021, 10:09 AM IST