ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖకు 18 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు - Oxygen tanks from Brunei countries to Visakhapatnam

విశాఖ తీరానికి సింగపూర్‌, బ్రూనై దేశాల నుంచి క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు ఐఎన్‌ఎస్‌ జలాశ్వ యుద్ధనౌకలో చేరుకున్నాయి.

Oxygen‌ tanks
ఆక్సిజన్‌ ట్యాంకులు

By

Published : May 24, 2021, 12:13 PM IST

సింగపూర్‌, బ్రూనై దేశాల నుంచి మొత్తం 18 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు, 3,650 ఆక్సిజన్‌ సిలిండర్లు, 39 వెంటిలేటర్లను ఐఎన్‌ఎస్‌ జలాశ్వ యుద్ధనౌకలో ఆదివారం తూర్పు నౌకాదళ జెట్టీకి తీసుకువచ్చినట్లు నౌకాదళ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్‌ ఆయిల్‌, గెయిల్‌తోపాటు వివిధ సంస్థలు ఆయా క్రయోజనిక్‌ ట్యాంకులు, ఇతర కీలక ఉపకరణాలను భారత్‌కు తెప్పించాయని తెలిపారు.

18 క్రయోజనిక్‌ ట్యాంకులకుగానూ 15 ట్యాంకుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉందని వివరించారు. సముద్రసేతు-2 కార్యక్రమంలో భాగంగా యుద్ధనౌకల్లో ఆయా ట్యాంకులను రవాణా చేసే బాధ్యతను నౌకాదళం నిర్వహిస్తోందని వెల్లడించారు.

ఇదీ చదవండీ..ఐదే రోజుల్లో.. కరోనాను గెలిచిన 90 ఏళ్ల వృద్ధుడు..!

ABOUT THE AUTHOR

...view details