సిటీ ఆఫ్ డెస్టినీ-విశాఖ. ప్రకృతి అందాలు, ప్రశాంతత కలగలిపిన విశాఖలో సొంతిల్లు ఉండాలనేది చాలా మంది కోరిక. ఆరేళ్లుగా ప్రాపర్టీ షోలను విజయవంతంగా నిర్వహిస్తూ క్రెడాయ్ వారి కలలను నిజం చేస్తోంది. ప్రతి ఏడాదిలానే ఈసారీ మరో ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. నేడు, రేపు, ఎల్లుండి... 3 రోజుల పాటు ఎంపీవీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్లో ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించనున్నారు. శని, ఆదివారాల్లో కొనసాగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. ఒకే చోట పదుల సంఖ్యలో ప్రముఖ స్థిరాస్తి సంస్థల స్టాళ్లు ఏర్పాటు చేశారు. అవసరమైనవారికి వెంటనే రుణం అందించేలా ఎస్బీఐ సైతం ఈ ప్రదర్శనలో పాలు పంచుకుంటోంది.
ప్రాపర్టీ షోకు వచ్చేవారి కోసం..లక్కీ డ్రా ద్వారా ప్రతి గంటకూ ఓ బంగారు నాణెం బహుమతిగా ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బంపర్ ప్రైజ్గా ఎలక్ట్రానిక్ బైక్నూ అందిస్తున్నారు. ప్రాపర్టీ షోను అంతా సద్వినియోగం చేసుకోవాలని క్రెడాయ్ ప్రతినిధులు కోరారు.