ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జోరుగా వానలకు బాణాసంచా వర్తకులు విలవిల - విశాఖలో ప్రారంభం కాని బాణసంచా విక్రయాలు

విశాఖలో భారీ వర్షాలతో బాణాసంచా వర్తకులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించక ఇంకా అమ్మకాలు మొదలు పెట్టలేదు. మరో రెండ్రోజుల్లో టపాసులు అమ్మకాలు చేయకపోతే నష్టాలు చవి చూస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాణసంచా

By

Published : Oct 25, 2019, 7:08 PM IST

బోణీ కొట్టని బాణసంచా వర్తకులు

విశాఖ నగరంలో ఏటా 2 వేలకు పైగా దుకాణాల్లో బాణాసంచా అమ్మకాలు జరుగుతాయి. కానీ మరో రెండు రోజుల్లో దీపావళి ఉన్నప్పటికీ ఇంకా ఒక్క దుకాణం కూడా తెరుచుకోలేదు. 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నందున లక్షలు పెట్టి కొన్న సరుకు గోదాంలో భద్రపరిచారు వర్తకులు. నగరంలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ మైదానం, ఎంవీపీ కాలనీ ఆళ్వార్ దాస్ స్టేడియంలో భారీ దుకాణాలు ఏర్పాటు చేశారు. అదే రీతిలో గోపాలపట్నం, గాజువాక, మధురవాడల్లో కూడా సమూహ దుకాణాలు వెలిశాయి. అయితే భారీ వర్షాలు, నెలాఖరులో దీపావళి రావటం ఈసారి బాణాసంచా వ్యాపారానికి ఇబ్బంది కలిగించేలా ఉందని వర్తకులు చెబుతున్నారు. మరోవైపు ఎమ్మార్పీ రేట్లకు అమ్మకాలు చేయాల్సి ఉన్నందున కొనుగోలు శాతం కూడా పడిపోయే అవకాశం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details