విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి ప్రమాదం అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సీపీఎం నేతలు ఆరోపించారు. గోపాలపట్నం సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నగర కార్యదర్శి గంగారావు మాట్లాడారు. ఘటన జరిగి 5 నెలలు అవుతున్నా కంపెనీని తరలించలేదన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఊసే లేదని విమర్శించారు. క్షతగాత్రులకు నేటికీ పరిహారం అందలేదన్నారు.
ఎల్జీ పాలిమర్స్ బాధితులకు పరిహారం అందలేదు : సీపీఎం
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగి ఐదు నెలలు అవుతున్నా...బాధితులకు పరిహారం అందలేదని సీపీఎం నేతలు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా సీపీఎం పోరాడుతుందని స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడి ఆందోళన చేస్తామన్నారు.
Cpm
ఘటన అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారని.. వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం నేటికీ అందలేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపడతామని తెలిపారు. పరిహరం కోసం ధర్నా చేస్తామని పోలీసుల అనుమతి కోరితే నిరాకరించారని పేర్కొన్నారు. ఈ చర్యలు కంపెనీ యాజమాన్యానికి సాయం చేసేలా ఉన్నాయని గంగారావు ఆరోపించారు.
ఇదీ చదవండి :వరదొస్తే వారికి భయం.. గేట్లెత్తితే జీవితాలు నరకం