ఇంటర్ విద్యార్థినిని హత్య చేసిన అఖిల్ సాయిని శిక్షించాలంటూ.. విశాఖ నగరంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద సీపీఎం నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్త్రీలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయంటూ.. ఆ పార్టీ నగర కార్యదర్శి డాక్టర్ బి. గంగారావు ప్రభుత్వంపై మండిపడ్డారు.
గాజువాకలో 17 సంవత్సరాల ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో, భార్యను అనుమానిస్తూ శివాజీపాలెంలో యాసిడ్ దాడితో మహిళలను బలి తీసుకున్నారని గంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.