పట్టణ సంస్కరణల్లో భాగంగా ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీపీఎం విశాఖలో పాదయాత్ర నిర్వహించింది. నగరంలోని అల్లిపురం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పాదయాత్రలో పెంచిన పన్నులకు వ్యతిరేకంగా కరపత్రాలను పంపిణీ చేశారు.
కొత్త పన్నుల విధానాన్ని నిరసిస్తూ.. సీపీఎం విశాఖలో పాదయాత్ర - విశాఖ జిల్లా తాజా వార్తలు
రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పన్ను విధానం ప్రజలపై అధిక భారాన్ని మోపుతోందని అంటూ విశాఖలో సీపీఎం పాదయాత్ర చేపట్టింది. ఈ నెల ఆరున నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిస్తూ నగరంలో కరపత్రాలు పంచారు.
సీపీఎం విశాఖలో పాదయాత్ర
గృహ విస్తీర్ణం పై కాకుండా, మార్కెట్ ధర పై పన్ను వేయడం దారుణమని సీపీఎం నాయకుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ నెల ఆరున మహా విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట నిర్వహించే నిరసన కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:'6వ తేదీన ధర్నాలను విజయవంతం చేయండి'