బ్యాంకులను ప్రైవేటు పరం చేసేందుకే కేంద్రప్రభుత్వం విలీనాలు చేస్తోందని సీపీఐ నగర కార్యదర్శి ఏ.జే. స్టాలిన్ ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్యాంకుల విలీనాన్ని తీవ్రంగా ఖండించారు. సామాన్య ప్రజలకు పరపతి, రుణ సౌకర్యాన్ని కలిగిస్తూ సమర్థ సేవలు అందిస్తున్న ఆంధ్రబ్యాంకును విలీనం చేయడాన్ని వ్యతిరేకించారు. రైతులకు, సామాన్యులకు ఆర్థిక సాయాన్ని అందించే బ్యాంకులను కుదించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డారు.
'బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకే విలీనాలు' - cpi round table meet against banks merge
బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకే కేంద్రప్రభుత్వం విలీనాలు చేస్తోందని సీపీఐ పార్టీ ఆరోపించింది. బ్యాంకులను కుదించడం వల్ల సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అభిప్రాయపడింది.
అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం