ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వం బ్లాక్​ మెయిలింగ్​ రాజకీయాలకు పాల్పడుతోంది' - cpi ramakrishna latest press meet

రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్​ మెయిలింగ్​ రాజకీయాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. హమీలు అమలు చెయ్యడంలో విఫలమైందని మండిపడ్డారు. మాస్కులు అడిగినందుకు మత్తు డాక్టర్​ సుధాకర్​ను వెంటాడి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఎస్​ఈసీ రమేశ్​ కుమార్​ను కలిసి.. స్థానిక ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.

'ప్రభుత్వం బ్లాక్​ మెయిలింగ్​ రాజకీయాలకు పాల్పడుతోంది'
'ప్రభుత్వం బ్లాక్​ మెయిలింగ్​ రాజకీయాలకు పాల్పడుతోంది'

By

Published : May 30, 2020, 12:10 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ అప్రజాస్వామిక సీఎంగా పేరు తెచ్చుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విశాఖలో మాట్లాడిన ఆయన.. ఎన్నికల హామీల విషయంలో జగన్​ మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. డీజీపీ అనుమతి తీసుకుని విశాఖ వచ్చిన తనను విమానాశ్రయంలోనే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం కోసం కక్కుర్తి పడి మద్యం దుకాణాలు తెరిచారని ధ్వజమెత్తారు.

మాస్కుల గురించి అడిగిన మత్తు డాక్టర్​ సుధాకర్‌ను వేధించి.. ఇప్పుడు పిచ్చివాడిగా ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సుధాకర్​ సస్పెన్షన్​ ఎత్తేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం బ్లాక్​ మెయిలింగ్​ ధోరణితో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. త్వరలోనే ఎస్​ఈసీ రమేశ్​ కుమార్​ను కలిసి.. స్థానిక ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details