ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ అనుమతులు రద్దు చేయాలి' - cm kcr wine shops

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సీపీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లీకేజీకి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

cpi narayana
cpi narayana

By

Published : May 7, 2020, 5:08 PM IST

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన చేశారు. ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి... యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులను సైతం సస్పెండ్ చేయాలన్నారు. బాధితులకు భారీ పరిహారం అందించాలని కోరారు.

దేశంలో పెట్రోల్‌ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని కేంద్రంపై నారాయణ ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ కార్డులు లేకున్నా ప్రతి వ్యక్తికి రూ.10వేల నగదు, 20కిలోల బియ్యం ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో భౌతిక దూరం పాటించాలన్న మోదీ ప్రభుత్వం... మద్యం దుకాణాలు తెరిచి నిబంధనలను తుంగలో తొక్కిందని అగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details