ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేంద్రం.. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మారుస్తోంది' - విశాఖలో వామపక్షాలు నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. కేంద్రం కార్పొరేటు కంపెనీలకు కొమ్ము కాస్తోందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మారుస్తోందని కేంద్రంపై మండిపడ్డారు.

cpi_narayana
cpi_narayana

By

Published : Sep 29, 2020, 8:03 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నిరసన దీక్ష చేపట్టాయి. ఈ దీక్షలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొన్నారు. కేంద్రం కార్పొరేటు కంపెనీలకు కొమ్ము కాస్తోందని, ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రైతులు కూలీలుగా మారిపోయే అవకాశం ఉందని ఆవేదన చెందారు.

నిత్యావసర వస్తువులు నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా కేంద్రం మారుస్తోందని .. ఏపీలో తెదేపా, వైకాపాలు స్వార్థ రాజకీయాల వలన రాష్ట్రానికి నష్టం జరుగుతోందని అన్నారు. సీఎ జగన్​మోహన్​రెడ్డి గతంలో జైలుకు వెళ్లి, ఆ సానుభూతితో మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవాచేశారు. కానీ చంద్రబాబు కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

ఇదీ చదవండి :పసిడి మరింత ప్రియం- నేటి ధరలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details