ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రైల్వేల ప్రైవేటీకరణ యత్నాన్ని కేంద్రం విరమించుకోవాలి' - visakhapatnam railway station latest news

దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేసేందుకు జరుగుతున్న యత్నాన్ని విశాఖ సీపీఐ నాయకులు ఖండించారు. ఈ విషయంపై పట్టణంలోని రైల్వేస్టేషన్​ వద్ద నిరసన చేపట్టారు. రైల్వేలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలపై ఛార్జీలు, సరుకు రవాణా భారం పెరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

cpi agitation at viakhapatnam railway station on privatization issue
విశాఖలో సీపీఐ నాయకుల ఆందోళన

By

Published : Jul 16, 2020, 4:19 PM IST

150 ఏళ్లుగా అభివృద్ధి చేసుకున్న రైల్యే శాఖను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న సీపీఐ నాయకులు.. విశాఖపట్నం రైల్వే స్టేషన్​ వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులను చేతబట్టుకొని ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేశారు.

పేద ప్రజలకు, సామాన్యులకు సులువుగా... తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే ఏకైక వ్యవస్త రైల్వే మాత్రమేనని సీపీఐ నాయకులు తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ డిమాండ్​ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details