విశాఖలోని కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్ పైనుంచి దూకి ఓ కరోనా రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మధురవాడకు చెందిన కిరణ్‌కుమార్‌గా తెలుస్తోంది. అదే ఆస్పత్రిలో మూడు రోజులుగా ఆయన కొవిడ్ చికిత్స తీసుకుంటున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. బాధితుడు ఎస్ బ్యాంకులో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు.
కేజీహెచ్‌పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య - కేజీహెచ్‌లో కరోనా రోగి ఆత్మహత్య
కరోనా రోగి విశాఖలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడిని స్థానిక మధురవాడకు చెందిన కిరణ్‌కుమార్‌గా గుర్తించారు.
కేజీహెచ్‌లో కొవిడ్ రోగి బలవన్మరణం