ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివాహాలు, అక్షయతృతీయ వేళ... బంగారం విక్రయాలు డీలా! - బంగారం కొనుగోళ్లు లేక వెలవెలబోతున్న దుకాణాలు

కొవిడ్ వ్యాప్తితో కొనుగోళ్లు లేక.. విశాఖలోని బంగారం వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కనీసం దుకాణాల్లో సిబ్బందికి జీతాలు సైతం చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు, అక్షయ తృతీయ సమయంలోనూ విక్రయాలు లేకపోవడం.. తమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేసిందని ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ ఎప్పడు నశిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నట్లు వాపోతున్నారు.

no demand for gold in visakha
విశాఖలో డిమాండ్ తగ్గిన బంగారం కొనుగోళ్లు

By

Published : May 13, 2021, 4:40 PM IST

Updated : May 13, 2021, 5:06 PM IST

కొనుగోళ్లు లేక విలవిలలాడుతున్న వ్యాపారులు

కరోనా మొదటి దశలో వ్యాపారం బాగోలేదంటూ సరిపెట్టుకున్న బంగారం వర్తకులను.. రెండో దశ సైతం ఇబ్బంది పెడుతోంది. అక్షయ తృతీయ సమయంలో ఏటా పెద్దఎత్తున కొనుగోళ్లు జరిగేవి. కానీ ఈ ఏడాది పెళ్లిళ్ల సీజనుతో పాటు అక్షయ తృతీయ వేళ ప్రజలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపలేదు. వ్యాపారాలు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విశాఖలో వర్తకులు చెబుతున్నారు. కనీసం దుకాణంలో ఉద్యోగులకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ ఎప్పుడు పూర్తిగా తొలగిపోతుందో.. మళ్లీ తిరిగి వ్యాపారం ఎప్పుడు పుంజుకుంటుందోనని ఎదురు చూస్తున్నట్లు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:'కరోనాకు జీవించే స్వేచ్ఛ ఉంది కదా?'

కొవిడ్ వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయని.. మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ.. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు వ్యాపారులు వాపోతున్నారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయకు కనీసం ఒక గ్రాము బంగారం కొనుగోలు చేసేవారని.. ఈ సారి ఖర్ఫ్యూ వల్ల దుకాణాలు తెరవడానికి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు సైతం ఎటువంటి ఆర్భాటం లేకుండా జరగడంతో.. బంగారం ఊసే ఎత్తడం లేదంటున్నారు. ఈ విధంగా వ్యాపారాలు కుచించుకుపోవడం బహశా చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

'కొవిడ్ నుంచి బయటపడ్డ వారికి బ్లాక్ ఫంగస్ ప్రమాదం'

Last Updated : May 13, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details