శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ గర్భిణీ కరోనాతో బాధపడుతోంది. ఆపరేషన్ కోసమని విమ్స్ ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆమెకు సిజేరియన్ చేశారు. శనివారం సాయంత్రం పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విమ్స్ వైద్యులను కలెక్టర్ అభినందించారు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధిత గర్భిణీ - విశాఖలో కరోనా గర్భిణీకి డెలివరీ న్యూస్
కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
![పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధిత గర్భిణీ COVID-19 positive pregnant lady delivered in vizag](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7703403-225-7703403-1592673749878.jpg)
COVID-19 positive pregnant lady delivered in vizag