కరోనాకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన 'కోవీ షీల్డ్ వాక్సిన్' మూడో విడత ట్రయల్స్ విశాఖ కేజీహెచ్‌లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఇద్దరికి వ్యాక్సిన్ ఇచ్చారు. వారిని నిరంతరం పర్యవేక్షిస్తుంటామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పీవీ. సుధాకర్ తెలిపారు.
వ్యాక్సిన్ రెండు విడతల ట్రయల్స్ మంచి ఫలితాలు ఇవ్వటంతో మూడో దశ కొనసాగిస్తున్నామని చెప్పారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈ ట్రయల్స్ ప్రారంభించారు. మొత్తం 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేజీహెచ్ వైద్యులు రంగం సిద్ధం చేశారు. డాక్టర్ మాధవి ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను ముఖ్య ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్నారు.