ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అప్పటివరకు సంతోషంగా గడిపారు.. లారీ ప్రమాదంలో కన్నుమూశారు! - vishakha road accidents

అప్పటి వరకు బంధువుల ఇంట్లో సంతోషంగా గడిపారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. లారీ వారి పాలిట మృత్యుపాశంగా మారింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్తను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణం విడిచారు.

couple died
couple died

By

Published : Aug 19, 2021, 12:25 PM IST

లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం విశాఖ జిల్లా కాకానినగర్ కూడలిలో జరిగింది.

బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ..

ప్రకాశం జిల్లా వేటపాలెం ప్రాంతానికి చెందిన వెంకట నాగేశ్వరావు, రమాదేవి దంపతులు కొన్నేళ్లుగా గాజువాక చినగంట్యాడలోని జగ్గు జంక్షన్​లో నివాసం ఉంటున్నారు. ఆయన శ్రీ చైతన్య కళాశాలలో అకౌంటెంట్​గా పనిచేస్తున్నారు. ఇవాళ వారి బంధువుల అమ్మాయికి విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. అక్కడి నుంచి బంధువులు కొనుగోలు చేసిన నూతన ఇంటిని చూడడానికి వెళ్లారు. కాసేపు అక్కడ ఆనందంగా గడిపి ఇంటికి బయలు దేరారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టగా.. ఘోరం జరిగింది.

విషాదంలోనూ వీడాలనుకొలేదు..

రోడ్డు ప్రమాదంలో లారీ వారి పైనుంచి వెళ్లింది. జీవితాంతం కలిసి బతుకుదామనుకున్న ఆ దంపతులు.. ప్రమాదం తరవాత ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఉండడం చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనలో.. రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. నాగేశ్వరరావు ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. దారిలో కన్నుమూశారు. కంచరపాలెం ట్రాఫిక్‌ సీఐ కృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎయిర్‌పోర్టు సీఐ సీహెచ్‌.ఉమాకాంత్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల కుమారుడు విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో చివరి ఏడాది చదువుతున్నాడు. రమాదేవి తల్లిదండ్రులు ఇటీవలే కొవిడ్‌ బారిన పడి మృతి చెందారు. వరుస ఘటనలతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదీ చదవండి:

Arrest: గుప్త నిధుల వేటగాడు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details