ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'భయంగా ఉంది... ప్రాణాలతో ఇంటికి వెళ్తానో? లేదో?'

విశాఖ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్​​(విమ్స్​)లో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నా వైద్య సిబ్బంది పట్టించుకోవటం లేదంటూ అక్కడ చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళతానో లేదోనని అతను కన్నీటి పర్యంతమయ్యాడు.

vims hospital
vims hospital

By

Published : Aug 2, 2020, 5:26 PM IST

Updated : Aug 2, 2020, 8:08 PM IST

కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో

విశాఖ విమ్స్ ఆసుపత్రిలో కరోనా రోగులు పడుతున్న కష్టాలపై అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ఆసుపత్రిలో నరకం చూస్తున్నామని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్లెదుటే తోటి కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని... పట్టించుకునే నాథుడే లేడని సెల్ఫీ వీడియోలో అతను పేర్కొన్నాడు. ప్రాణాలతో ఇంటికి చేరుకుంటామో లేదోనని భయాందోళన వ్యక్తం చేశాడు.

నా కళ్లెదుటే ఓ కరోనా బాధితుడు రాత్రంతా అరిచి.. అరిచి ప్రాణాలు కోల్పోయాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడ అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ పట్టించుకోవడానికి ఎవరూ లేరు. అలాంటప్పుడు రోగులను చేర్చుకుని ఎందుకు వారి ప్రాణాలతో ఆడుకుంటారు. చాలా బాధగా ఉంది. నాకు పిల్లలున్నారు. ఇంటికి వెళ్తానో లేదోనని భయంగా ఉంది. అప్పుడప్పుడు వచ్చి మాత్రలు ఇచ్చేసి వెళ్తున్నారు. ఒక్క దుప్పటి కూడా ఇవ్వటం లేదు. బాత్రూమ్​లు మరీ అధ్వానంగా ఉన్నాయి. ఓ వృద్ధురాలు కిందపడిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. కరోనా కంటే ముందే ఆసుపత్రి చూసి వైరస్ బాధితులు చనిపోయేలా ఉన్నారు. ఎవరైనా చనిపోతే కనీసం శానిటైజ్ చేయకుండా ఆ బెడ్లను మరొకరికి ఇస్తున్నారు -సెల్పీ వీడియోలో కరోనా బాధితుడి ఆవేదన

ఈ వ్యవహారంపై విమ్స్ అధికారులు స్పందించారు. వృద్ధురాలు స్నానాల గదికి వెళ్తుండగా పడిపోయారని వెల్లడించారు. వెంటనే స్పందించి ఆమెను తిరిగి బెడ్‌పైకి చేర్చామని... ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

Last Updated : Aug 2, 2020, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details