విశాఖలో కరోనా పరీక్షలు ముమ్మరం - Corona test centers latest news in Visakhapatnam
విశాఖ నగరంలో కొవిడ్-19 పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. నగరంలో ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వార్డు కార్యాలయాలకు తీసుకొచ్చి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విశాఖ నగరంలో కొవిడ్-19 పరీక్షలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వార్డు కార్యాలయాలకు తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని జోన్-2 శ్రీ నగర్ వార్డ్ కార్యాలయంలో అనుమానితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించి.... వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. వారి నుంచి సేకరించిన నమూనాలను కొవిడ్-19 ప్రత్యేక పరీక్ష కేంద్రాలకు తరలిస్తున్నారు. అనుమానితులపై వైద్య బృందాలు ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు.