విశాఖ విమ్స్ లో కరోనా చికిత్స పొందుతున్న వ్యక్తి.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిలి ప్రాంత గొళ్లపాలానికి చెందిన ఎం.వేణు బాబు(37) ఈ నెల 1న విమ్స్ లో చేరి కరోనా చికిత్స పొందుతున్నాడు. ఏమవుతుందోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో ఇలాంటి ఘటన జరగడం రెండో సారి. ఇప్పటి వరకు విమ్స్‌లో ఇద్దరు, కేజీహెచ్సీఎస్ ఆర్ వార్డులో నలుగురు ఆత్మహత్య చేసకున్నారు.
విశాఖలో.. కరోనా రోగి ఆత్మహత్య - విశాఖలో కరోనా రోగి ఆత్మహత్య వార్తలు
కరోనా సోకి చికిత్స పొందుతున్న రోగి.. విశాఖలో విమ్స్ భవనం నుంచి కిందకు దూకి.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటి వరకు విశాఖలో కరోనా భయంతో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
విశాఖలో.. కరోనా రోగి ఆత్మహత్య
Last Updated : Jun 3, 2021, 11:53 AM IST