విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి బాలయోగి బాలురు గురుకుల పాఠశాల ఆవరణలో చెట్లకు కరోనా పువ్వులు పూశాయి. కొన్నాళ్ల క్రితం ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలను నాటారు. వాటిలో విద్యార్థుల భోజనశాల సమీపంలోని చెట్లకు పెద్ద ఎత్తున కరోనా వైరస్ నమూనా ఆకారంలో పుష్పాలు పూశాయి. ఆకర్షణీయంగా ఉన్న వీటిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఆకర్షణీయం.. ఆశ్చర్యం.. చెట్లకు కరోనా పువ్వులు..! - corona flowers in visakhapatnam news
ఆ పాఠశాలలో చెట్లకు కరోనా పూలు పూశాయి. అదేంటీ చెట్లకు కరోనా పూయడమేంటని అనుకుంటున్నారా..? విశాఖ జిల్లాలోని ఓ పాఠశాలలో అచ్చం కరోనా నమూనాలతో ఉన్న పుష్పాలు పూశాయి. వీటిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందామా..!
ఆకర్షణీయం.. ఆశ్చర్యం.. చెట్లకు కరోనా పువ్వులు..!